హైదరాబాద్ నగరంలో నేరాల నియంత్రణే లక్ష్యంగా... నగర ప్రజల రక్షణే ధ్యేయంగా అర్ధరాత్రి హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలో ఉన్న హోటళ్లు, లాడ్జ్‌లపై ఏకకాలంలో ఐదు వేల మంది పోలీసులతో ఈ మెగా సర్ప్రైజ్ చెకింగ్స్ నిర్వహించారు. స్వయంగా రంగంలోకి దిగిన సీపీ సజ్జనార్... హోటళ్లలో బస చేస్తున్న వారి ఆధార్ కార్డులు, గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు, హోటళ్లలోని సీసీ కెమెరాల పనితీరును, భద్రతా ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు.
హోటళ్లకు వచ్చే ప్రతి ఒక్క గెస్ట్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.ఆపరేషన్ కవచ్'లో భాగంగానే ఈ విస్తృత తనిఖీలు జరుగుతున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే నిన్న నగరవ్యాప్తంగా జరిగిన వాహనాల తనిఖీల్లో... నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఏకంగా మూడు వేల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల భద్రత కోసం ఇలాంటి సర్ప్రైజ్ చెకింగ్స్ ఇకపైనా కొనసాగుతాయని సీపీ సజ్జనార్ తేల్చి చెప్పారు.
