V6 News

ఆపరేషన్ సేఫ్ స్కూల్..రూ.1.10 కోట్ల పొగాకు ఉత్పత్తులు సీజ్

 ఆపరేషన్ సేఫ్ స్కూల్..రూ.1.10 కోట్ల పొగాకు ఉత్పత్తులు సీజ్


బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో ఈ నెల 18న నిర్వహించిన విస్తృత సోదాల్లో రూ.1.10 కోట్ల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సిటీ కమిషనర్​ సజ్జనార్​ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

చార్మినార్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 119 కేసులు, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 102, గోల్కొండలో 98, ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 78, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 64, జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 54, శంషాబాద్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 52 కేసులు నమోదు చేశామన్నారు. విద్యాసంస్థల సమీపంలో చట్టవిరుద్ధంగా పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తామని తెలిపారు. ఇలాంటివి జరిగితే డయల్ 100 లేదా, 8712661601 నంబర్​కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.