దొంగల తెలివి : ఓ ఇంట్లో చోరీ సెల్ ఫోన్లు.. మరో దోపిడీ ఇంట్లో వదిలేసిన దొంగలు

దొంగల తెలివి : ఓ ఇంట్లో చోరీ సెల్ ఫోన్లు.. మరో దోపిడీ ఇంట్లో వదిలేసిన దొంగలు

హైదరాబాద్ సిటీలోని నాగోల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన చోరీలు సంచలనంగా మారాయి. దొంగలు వ్యవహరించిన తీరుతో పోలీసులు షాక్ అయ్యారు. వరసగా రెండిళ్లల్లో చోరీ చేసిన దోపిడీదారులు.. ఒక ఇంట్లో చోరీ చేసిన సెల్ ఫోన్ ను.. మరో ఇంట్లో పడేసి వెళ్లారు. విచారణలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో అవాక్కయ్యారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నాగోలులోని తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలోని సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లో అర్థరాత్రి చోరీ జరిగింది. పోలీసులకు కంప్లయింట్ చేయటంతో.. రంగంలోకి దిగారు. ఇంట్లో దొరికిన సెల్ ఫోన్ పై విచారణ చేయగా.. ఆ సెల్ ఫోన్ మాది కాదని సుదర్శన్ ఇంటి వాళ్లు చెప్పారు. దొంగలది కావొచ్చు అనే అనుమానంతో విచారణ చేయగా.. ఆ సెల్ ఫోన్ సోలాపూర్ లో ఉన్న హార్సలాన్ అనే యువకుడిదిగా గుర్తించారు. అతనే దొంగతనం చేసి.. తన సెల్ ఫోన్ మర్చిపోయి ఉంటాడని భావించి.. అతన్ని విచారించారు. 

విచారణ సందర్భంగా.. హార్సలాన్ అనే యువకుడు చెప్పిన సమాధానంతో షాక్ అయ్యారు పోలీసులు. హార్సలాన్ ఇంట్లోనూ చోరీ జరిగిందని.. ఈ మేరకు పోలీస్ కంప్లయింట్ ఇచ్చానని.. మా ఇంట్లో వస్తువులతోపాటు నా సెల్ ఫోన్ కూడా దొంగలు ఎత్తుకెళ్లారని స్పష్టం చేశాడు హార్సలాన్. ఆ దిశగా విచారణ చేయగా పోలీసులకు క్లారిటీ వచ్చింది. హార్సలాన్ దొంగతనం చేయలేదని.. అతని ఇంట్లో కొట్టేసిన సెల్ ఫోన్ ను.. సుదర్శన్ ఇంట్లోనే దొంగలు కావాలని పడేసి వెళ్లారని.. పోలీస్ విచారణను తప్పుదోవ పట్టించటానికి ఇలా చేశారని నిర్థారణకు వచ్చారు. పోలీసులను డైవర్ట్ చేయటానికి దొంగలు ఇలా చేశారనేది స్పష్టం అయ్యింది. 

Also Read : వైసీపీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కీలక నేతలకు ముందస్తు బెయిల్.. 

మొదట దొంగతనం జరిగిన హార్సలాన్ ఇంట్లో 4 తులాల బంగారంతోపాటు సెల్ ఫోన్లు కొట్టేశారు దొంగలు. అందులోని సెల్ ఫోన్లను సుదర్శన ఇంట్లో పడేసి వెళ్లారు. ఈ కేసు విచారణలో దొంగలు కొత్తగా ఆలోచిస్తున్న తీరు.. ఐడియాలు బయటపడ్డాయి అంటున్నారు పోలీసులు.