
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆశ్రమ, ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్ల పనితీరును పరిశీలించేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 164 హాస్టళ్లకు మొత్తం 82 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఒక్కొక్కరు రెండు హాస్టళ్లు చొప్పున తనిఖీ చేసి, రెండు రోజుల్లో ఫొటోలతో కూడిన రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకులాల అధికారులు, ప్రత్యేక అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.