
హైదరాబాద్, వెలుగు: ప్రజావాణి, ప్రజాదర్బార్ కు వచ్చిన ప్రతి దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన 76 మంది ఫిర్యాదులు చేశారు. ఇందులో గృహ నిర్మాణ శాఖకు 28, హైదరాబాద్ ఆర్ డీఓ 9, సికింద్రాబాద్ ఆర్ డీఓ 6, జిల్లా సంక్షేమ అధికారి 3, డీఈఓ 2, ఇతరశాఖలకు 28 దరఖాస్తులు వచ్చాయి.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు ఇచ్చిన దరఖాస్తులు, ప్రజాదర్బార్, మిస్ లేనిస్ కంప్లయింట్లపై వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో చెత్త, చెదారం లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్ సింగ్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.