తనిఖీలు.. సూచనలు: నగరంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ హరిచందన

తనిఖీలు.. సూచనలు: నగరంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ హరిచందన

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​ కలెక్టర్​ హరిచందన బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పురాణాపూల్​లోని అఫ్జల్‌‌‌‌గంజ్ ప్రభుత్వ హైస్కూల్ ను విజిట్​ చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్​వీ నగర్​హౌసింగ్​బోర్డు కాలనీలోని పురాతన బిల్డింగులను పరిశీలించారు. 50 ఏండ్లుగా శిథిలమైన బిల్డింగుల్లో ఉంటున్నామని స్థానికులు చెప్పగా, డబుల్​ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

బహదూర్‌‌‌‌పురలోని పురాణపూల్, కిషన్‌‌‌‌బాగ్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను విజిట్​చేసి రోగులతో మాట్లాడారు. అనంతరం బహదూర్‌‌‌‌పురా తహసీల్దార్ ఆఫీసును తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్‌‌‌‌వో డాక్టర్ వెంకటి, తహసీల్దార్ బాలశంకర్, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వో డాక్టర్ శశికళ, మెడికల్ ఆఫీసర్ బుష్రా అంజుమ్, ల్యాబ్ మేనేజర్ సంగీత, అఫ్జల్‌‌‌‌గంజ్ హైస్కూల్​హెచ్‌‌‌‌ఎం పద్మజా కుమారి ఉన్నారు.