
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు వర్షాకాల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. బుధవారం కూకట్‌పల్లి, ఖైరతాబాద్ జోన్లలో జోనల్ కమిషనర్లు అపూర్వ చౌహాన్, అనురాగ్ జయంతితో కలిసి స్పెషల్ డ్రైవ్‌ను ఆయన పరిశీలించారు.
కూకట్‌పల్లిలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను, ఖైరతాబాద్ సర్కిల్‌లో అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట్ ప్రాంతాలను తనిఖీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రజలు సహకరించాలని, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా, ఇంటి చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు.