మరింత సమర్థవంతంగా బెలోమ్

మరింత సమర్థవంతంగా బెలోమ్

హైదరాబాద్, వెలుగు : జీవ ఎరువులు, ప్రాణాధార పోషకాల తయారు చేసే హైదరాబాద్‌‌‌‌ కంపెనీ బయోఫ్యాక్టర్‌‌‌‌ పరిశోధనలో మరో ముందడుగు పడింది. అనావృష్టి, అతివృష్టిలోనూ మెరుగైన పంట దిగుబడి కోసం అత్యంత సమర్థవంతంగా పనిచేసే "బెలోమ్" ఫోలియర్‌‌‌‌ న్యూట్రిమేషన్​ను మరింత సమర్థవంతంగా తయారు చేసింది.  ప్రపంచంలో తొలిసారిగా మెటబోలైట్‌‌‌‌ అసిస్టెడ్‌‌‌‌ మైక్రాన్‌‌‌‌ సైజ్డ్‌‌‌‌ (ఏంఏఎంఎస్) న్యూట్రిమేషన్‌‌‌‌ తయారు చేసి ఇప్పటికే విజయవంతంగా విక్రయిస్తోంది.

ఆధునీకరించిన బెలోమ్ ఉత్పాదనపై దేశవ్యాప్తంగా సాగించిన పరిశోధనలలో అద్భుత ఫలితాలు వచ్చాయని బయోఫ్యాక్ ఇన్‌‌‌‌పుట్స్ ఫౌండర్, సీఈవో ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి వెల్లడించారు. మొక్కకు కావలసిన 13 రకాలైన ప్రాణాధార పోషకాలు ఇందులో ఉంటాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆధునీకరించిన ‘బెలోమ్’ సిరీస్ ఉత్పాదనలను చేరవేరుస్తామని ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి చెప్పారు. ‘‘అన్ని రకాల పంటలకు ఈ ఉత్పాదనను వినియోగించవచ్చు.

వర్షాధార ప్రాంతంలో సాగయ్యే వాణిజ్య పంటలకు సైతం అద్భుతంగా దిగుబడి వచ్చింది. తక్కువ ఖర్చుతో సాగు చేయవచ్చు. దిగుబడి 20–-30 శాతం పెరిగిందని పరిశోధనలో నిరూపితమైంది. తెగుళ్లు, వ్యాధుల నుంచి తట్టుకోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. బయోఫ్యాక్టర్‌‌‌‌ పరిశోధన, అభివృద్ధి విభాగం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సైంటిఫిక్, ఇండస్ట్రియల్‌‌‌‌ రిసర్చ్‌‌‌‌కు (డీఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌) నుంచి ధ్రువీకరణ ఉంది”అని ఆయన వివరించారు.