సైబర్ క్రైమ్, డ్రగ్స్, ట్రాఫిక్పై ఫోకస్ పెడ్తా

సైబర్ క్రైమ్, డ్రగ్స్, ట్రాఫిక్పై ఫోకస్ పెడ్తా

హైదరాబాద్ ట్రాఫిక్పై మరికొద్ది రోజుల్లో యాక్షన్ ప్లాన్ చేపడుతామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆపరేషన్ రోప్లో పార్కింగ్, ఫుట్పాత్ ఆక్రమణలపై ఫోకస్ పెడుతామన్నారు. మల్టీప్లెక్స్, మాల్స్లో 60 శాతం, కమర్షియల్ బిల్డింగ్స్లో 40 శాతం, అపార్ట్మెంట్లలో 30 శాతం పార్కింగ్ ఉండాలన్నారు. ఫుట్పాత్లు వదిలేసి రోడ్లపై వచ్చి బిజినెస్ చేసే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. స్టాప్ లైన్ నియంత్రణ అందరికీ అలవాటు అవ్వాలన్న సీపీ.. ట్రాఫిక్రూల్స్ అందరూ పాటించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. 

ప్రజలకు ట్రాఫిక్ ఫ్రీ అనుభూతి కలగాలని సీపీ ఆనందర్ అన్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్, ట్రాఫిక్ పై ఫోకస్ పెడుతానని చెప్పారు. బందోబస్తు ఎక్కువవడంతో ట్రాఫిక్పై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైందని..వచ్చే రోజుల్లో ట్రాఫిక్పై యాక్షన్ ప్లాన్ ఉంటుందన్నారు. కరోనా వచ్చాక వాహనాల సంఖ్య భారీగా పెరిగిందన్న ఆయన.. హైదరాబాద్ లో 77 లక్షలకు పైగా వాహనాలున్నాయని తెలిపారు.