బిగ్ బ్రేకింగ్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు

 బిగ్ బ్రేకింగ్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు

తెలంగాణ పోలీస్ శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది.. అప్పుడొకరు.. ఇప్పుడొకరు అన్నట్లు కాకుండా.. మొత్తం వ్యవస్థల్లోని కోవర్టులను తలోదిక్కు పంపిస్తున్నారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖలోని విషయాలను బీఆర్ఎస్ నేతలకు చేరవేరుస్తున్నారనే అనుమానం ఉన్న వారిపై నిఘా పెట్టారు ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా.. కేసీఆర్, కేటీఆర్ కోటరీకి సమాచారం చేరవేస్తూ.. ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు మచ్చ తీసుకొచ్చే పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు..

ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని.. ఒకేసారి మార్చేశారు పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. పోలీస్ స్టేషన్ పరిధిలో 86 మంది సిబ్బంది పని చేస్తుంటే.. వాళ్లందరినీ మరో ప్రాంతానికి బదిలీ చేశారు. ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు అందర్నీ కొత్తవారిని నియమించారు. పోలీస్ స్టేషన్ లోని మొత్తం సిబ్బందిని ఒకేసారి మార్చటం అనేది పోలీస్ శాఖలోనే ఇది ఫస్ట్ టైం కావటం విశేషం. 

ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో.. పంజాగుట్ట పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తుంది. అదే విధంగా పదేళ్లుగా ఒకే పోలీస్ స్టేషన్ లో పని చేస్తూ.. అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది మొత్తాన్ని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు.

 పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు కొత్త సిబ్బందిని సీపీ కేటాయించనున్నారు. వివిధ పోలీస్‌స్టేషన్ల నుంచి పంజాగుట్ట పీఎస్‌కు కొత్త సిబ్బంది నియామకం జరుగనుంది