ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు

ట్విట్టర్ కు  హైదరాబాద్ పోలీసుల నోటీసులు

ట్విట్టర్ కి నోటీసులిచ్చారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నటి మీరా చోప్రా కేసులో ట్విట్టర్ కు నోటీసులు జారీ చేశారు. గతేడాది జూన్ లో నటి మీరా చోప్రాపై అసభ్యకరమైన మేసేజ్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పట్లో సైబర్ క్రైమ్ లో కేసుతో పాటు.. నోటీసులు ఇచ్చారు. దీంతో మేసేజ్ లను డిలీజ్ చేసింది ట్విట్టర్. అయితే ఆ మేసేజ్ లు పెట్టిన వ్యక్తి వివరాలు ఇవ్వకపోవటంతో మరోసారి ట్విట్టర్ కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే సైబర్ క్రైం పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించలేదు ట్విట్టర్. అయితే కేంద్ర సర్కార్ రీసెంట్ గా తెచ్చిన చట్టం ప్రకారం మరోసారి ట్విట్టర్ కి నోటీసులిచ్చినట్లు తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు.