న్యూఇయర్ షాక్ : తాగి వాహనం నడిపితే రూ.15 వేల ఫైన్

న్యూఇయర్ షాక్ : తాగి వాహనం నడిపితే రూ.15 వేల ఫైన్

మందు కొట్టి వాహనాలు నడిపే వారిపై అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15వేల వరకు జరిమానా విధించాలని హైదరబాద్ నగర పోలీసులు నిర్ణయించారు. మొదటిసారి నేరం చేసిన వారు గరిష్టంగా రూ. 10వేల వరకు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్షను అనుభవించవచ్చు. రెండవసారి (లేదా అంతకంటే ఎక్కువ) పట్టుబడిన వారికి రూ. 15వేల జరిమానా విధించబడుతుంది. దాంతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్షను కూడా విధించవచ్చు.

ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసినందుకు క్యాబ్ డ్రైవర్లకు కూడా జరిమానా విధించబడుతుందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 31న రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్‌కు మూడు రోజులు మాత్రమే ఉన్నందున, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు.. ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే రూ.15వేల వరకు జరిమానా విధించనున్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేసినందుకు గానూ క్యాబ్‌లకు సైతం ఫైన్ వేయనున్నారు.

జరిమానాలు, జైలు శిక్షలతో పాటు, క్రైమ్ ఫ్రీక్వెన్సీని బట్టి, నేరస్థుల డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా స్వాధీనం చేసుకుంటారు. లేదంటే వారి లెసెన్స్ లను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది.

ఫ్లై ఓవర్లు మూసివేత

కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 30న రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పది ప్రధాన ఫ్లై ఓవర్లు, కొన్ని రహదారులను మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

మూసివేయనున్న ఫ్లై ఓవర్లు ఇవే:

  •     శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్
  •    గచ్చిబౌలి ఫ్లై ఓవర్
  •     బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌లు (1 & 2)
  •     షేక్‌పేట్ ఫ్లైఓవర్
  •     మైండ్ స్పేస్ ఫ్లైఓవర్
  •     రోడ్ నెం.45 ఫ్లై ఓవర్
  •   దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్
  •     సైబర్ టవర్ ఫ్లైఓవర్
  •     ఫోరమ్ మాల్-JNTU ఫ్లైఓవర్
  •     ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్
  •     బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్)

వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ORR), PVNR ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా ముందుజాగ్రత్త చర్యగా డిసెంబర్ 31 రాత్రి సమయంలో మూసివేయనున్నారు. ఈ మార్గంలో RGIA-బౌండ్ వాహనాలను మాత్రమే అనుమతిస్తారని సైబరాబాద్, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

Traffic Advisory in view of New Year Celebrations.. pic.twitter.com/2SAtF8LmY7

— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) December 27, 2023