చంద్రయాన్ 3కి ఆయిల్ సప్లయ్ చేసింది హైదరాబాద్ కంపెనీనే..

చంద్రయాన్ 3కి ఆయిల్ సప్లయ్ చేసింది హైదరాబాద్ కంపెనీనే..

మైనస్ 300 డిగ్రీలు.. 14 రోజులు చీకటి.. చంద్రుడి దక్షిణ దృవంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. అలాంటి చోట విజయవంతంగా ల్యాండ్ అయ్యింది చంద్రయాన్ 3. అంతేనా.. చంద్రుడిపై చకచకా తిరుగుతున్న రోవర్..  ఫొటోలు, వీడియోలు పంపిస్తూ.. చంద్రుడి రహస్యాలను ప్రపంచానికి చెబుతోంది. ఇంతటి ఘన విజయంలో.. చంద్రుడి దగ్గరకు చంద్రయాన్ 3 వెళ్లటంలో కీలకం ఏంటో తెలుసా.. ఆయిల్.. ఇంధనం.. 4 లక్షల కిలోమీటర్లు.. ఆకాశంలో ప్రయాణించటం అంటే మాటలు కాదు. ఇంధనం కావాలి. అది కూడా మన పెట్రోల్ బంకుల్లో దొరికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. దానికి ప్రత్యేకమైన ఇంధన కావాలి. అలాంటి ఇంధనాన్ని అందించింది హైదరాబాద్ కంపెనీ అంటే నమ్ముతారా.. ఇప్పుడు నమ్మితీరాలి.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ఇంధనం తయారీ, హైదరాబాద్ కంపెనీపై ఆసక్తి చూపించటం విశేషం. 

చంద్రయాన్ 3 సక్సెస్ తో దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అదే సమయంలో హైదరాబాద్ కు చెందని ప్రముఖ కంపెనీ CNC టెక్నిక్స్‌లో  చంద్రయాన్ 3 సక్సెస్ ను ఎంజాయ చేసింది. ఎందుకంటే చంద్రయాన్ 3 రాకెట్ కు ఇంధనం అందించిన సంస్థ ఇదే. ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనల్లో భారత్  పురోగతికి నిశ్శబ్దంగా తోడ్పడింది. 

1987లో  హైదరాబాద్ లో CNC టెక్నిక్స్‌ ను బండారు విజయ్ కృష్ణ చే స్థాపించబడింది. దాదాపే ఏడేళ్ల కృషి తర్వాత  కమిట్ మెంట్తో  CNC టెక్నిక్స్ చంద్రయాన్-3 కు ఇంధన సరఫరా చేయడం ప్రారంభించింది.  ఏండ్లు గడుస్తు్న్నా కొద్దీ.. భారత్ అంతరిక్ష శోధనలో కీలకంగా మారింది. ఈ కంపెనీకి నాలుగు శాఖలున్నాయి. మూడు హైదరాబాద్ లో ఉండగా.. ఒకటి విశాఖ పట్నంలో ఉంది. 2008 నుంచి ఇస్రోతో  CNC టెక్నిక్స్‌ అనుబంధం కొనుసాగుతోంది.  మొదట రష్యా  క్రయోజెనిక్ ఇంధనాన్ని దిగుమతి చేసుకున్న భారత్.. ఇండియాలోనే క్రయోజెనిక్ ఇంధన ఉత్పత్తికి ఇస్రో.. CNC టెక్నిక్స్‌ సంస్థను ప్రోత్సహించారు.