
జంట జలాశయాలకు వరద తగ్గుముఖం పట్టింది. పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు పడక పోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయాలకు సంబంధించి ఉస్మాన్‌సాగర్ పది గేట్లను, హిమాయత్ సాగర్‌కు సంబంధించి 6గేట్లను అధికారులు మూసీ వేశారు.
ప్రస్తుతం పరీవాహక ప్రాంతాల నుంచి తక్కువగానే వరదనీరు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ నుంచి 2050 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ నుంచి 1850 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ కి 1100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 884 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వుంది. హిమాయత్ సాగర్ కి 4వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 3,851 క్యూసెక్కుల అవుట్ ఫ్లో వుంది.