ప్రొ పంజా లీగ్ .. టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సెమీస్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌

ప్రొ పంజా లీగ్ ..  టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సెమీస్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్‌‌‌‌‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌)లో తెలుగు రాష్రాల టీమ్‌‌‌‌‌‌‌‌ కిరాక్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ టాప్ లేపింది. లీగ్​ దశలో పది మ్యాచ్​ల్లో ఎనిమిది విజయాలు సాధించిన  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 137 పాయింట్లతో టాప్​ ప్లేస్​తో సెమీఫైనల్​ చేరుకుంది. శుక్రవారం జరిగిన  లీగ్​ చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైదరా బాద్‌‌‌‌‌‌‌‌ 13-9తో  ముంబై మజిల్‌‌‌‌‌‌‌‌ జట్టుపై గెలిచింది. సీజన్‌‌‌‌‌‌‌‌లో  వరుసగా ఏడో విక్టరీ సాధించిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శనివారం జరిగే సెమీఫైనల్లో రోహతక్‌‌‌‌‌‌‌‌ రౌడీస్‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కొచ్చి కెడిఎస్‌‌‌‌‌‌‌‌తో ముంబై పోటీపడనుంది.