కూల్ డ్రింక్ డబ్బులు అడిగితే దుకాణంపై దాడి.. నలుగురు నిందితులకు జైలు శిక్ష

కూల్ డ్రింక్ డబ్బులు అడిగితే దుకాణంపై దాడి.. నలుగురు నిందితులకు జైలు శిక్ష

హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్లో నలుగురు యువకులు రెచ్చిపోయారు. పీకలదాకా తాగి కిరాణా దుకాణం యజమానిని దుర్భాషలాడారు. 

రాకీ ఫిలిప్స్, మహ్మద్ మాజ్ ఖాన్, మహ్మద్ అర్బాజ్, మహ్మద్ తైమూర్ అనే నలుగురు జులై 17వ తేదీ రాత్రి ఫుల్ గా తాగారు. అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్ లో ఓ కిరాణా దుకాణానికి వెళ్లారు. అక్కడ కూల్ డ్రింక్స్ తీసుకున్నారు. అయితే షాపులో ఉన్న యజమాని కూల్ డ్రింక్స్ డబ్బులు అడిగింది. దీంతో రెచ్చిపోయిన పోకిరీలు.. దుకాణం యజమానిని తీవ్రంగా కొట్టారు. బండబూతులు తిట్టారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..వారిని కోర్టులో హాజరపర్చారు. కోర్టు నలుగురికి 18 రోజుల జైలు శిక్ష విధించింది.