జీతాలు ఇవ్వట్లేదని హైదరాబాద్ లో హోంగార్డు ఆత్మహత్యాయత్నం

జీతాలు ఇవ్వట్లేదని హైదరాబాద్ లో హోంగార్డు ఆత్మహత్యాయత్నం

జాబ్ రెగ్యులరైజ్​, జీతాలు రావట్లేదని రవీందర్ (37) అనే హోంగార్డ్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోషామహల్​లోని కమాండెంట్ ఆఫీస్​లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్నవారు రవీందర్​ను ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు. శరీరం 55శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పాతబస్తీ రక్షాపురానికి చెందిన రవీందర్ (హెచ్​జీ 8025) 15 ఏండ్లుగా హోంగార్డ్​గా పని చేస్తున్నాడు. ఇద్దరు కొడుకులతో కలిసి ఛత్రినాకాలో ఉంటున్నాడు. 

చిలకలగూడ పీఎస్​లో విధులు నిర్వహిస్తూ ఇటీవల చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్​కు ట్రాన్స్​ఫర్ అయ్యాడు. హోంగార్డుల రెగ్యులరైజ్, జీతాల చెల్లింపుల విషయంలో హోంగార్డ్స్ అసోసియేషన్​తో కలిసి పోలీస్ ఉన్నతాధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలోనే అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆదివారం మంత్రి హరీశ్ రావును కలిశాడు. హోంగార్డులను రెగ్యులరైజ్ చేయడం సాధ్యం కాదని హరీశ్​రావు చెప్పడంతో రవీందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, అయినా న్యాయం జరగడం లేదంటూ బాధపడ్డాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం గోషామహల్ హోంగార్డ్స్ కమాడెంట్ ఆఫీస్​కు వెళ్లాడు. 

జీతాలు, రెగ్యులరైజేషన్ ప్రస్తావన

జీతాల ఆలస్యం, రెగ్యులరైజేషన్​పై గోషామహల్ కమాండెంట్ అధికారులను రవీందర్ అడిగినట్లు అసోసియేషన్ సభ్యులు చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రవీందర్ మనస్తాపానికి గురయ్యాడని వివరించారు. ముందుగానే తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడని భావిస్తున్నట్లు తెలిపారు. రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో రవీందర్ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్ చేశారు.