పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అన్నారు అమర్ రాజా గ్రూప్ చైర్మెన్, గల్లా జయదేవ్. సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీస్ కి మంచి సపోర్ట్ ఇస్తున్నారని కొనియాడారు. సోమవారం (డిసెండర్ 08) గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. గత ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీస్ కి ఎలా సపోర్ట్ ఉందో... ఈ ప్రభుత్వం కూడా అలాగే సపోర్ట్ చేస్తోందని అన్నారు.
ఫ్యూచరర్ సిటీలో తాము కూడా భాగస్వాములం అవుతామని చెప్పారు. పదేళ్ల ప్లాన్ తో హైదరాబాద్ లో మా గ్రూప్ విస్తరిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ జనాభా నగరాలకు వస్తున్నారని.. ఈ తరుణంలో ఫ్యూచర్ సిటీ నిర్మించడం మంచి పరిణామం అని మెచ్చుకున్నారు.
తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయని తెలిపారు గల్లా జయదేవ్. హైదరాబాద్ తో పాటు అమరావతి డెవలప్ అవుతోందని అన్నారు.
