హైదరాబాద్, వెలుగు: ఎఫ్‌ఐహెచ్ హాకీ విమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ రెడీ అవుతోంది. మార్చి 8–14వ తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో హాకీ ఇండియా ప్రెసిడెంట్, లెజెండరీ ప్లేయర్ దిలీప్ టిర్కీ గురువారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలోని హాకీ కాంప్లెక్స్‌ను సందర్శించాడు.
స్టేడియం పునరుద్ధరణ, కొత్తగా వేస్తున్న రెండు ఆస్ట్రో -టర్ఫ్ పనులను సమీక్షించాడు. ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న స్టేడియం ఆధునికీకరణ, టోర్నీ ఏర్పాట్లు, టర్ఫ్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రభుత్వ మద్దతు, యువ ప్లేయర్లకు కోచింగ్ ఏర్పాట్లు, నేషనల్ క్యాంప్స్ ఏర్పాటుతో హాకీలో మళ్లీ మంచి రోజులు వచ్చి హైదరాబాద్ వెలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
