
- ప్రారంభించిన టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మాదాపూర్, వెలుగు : హైటెక్స్‌లో శుక్రవారం హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్, పెటెక్స్ ఎక్స్ పోను రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ప్రోత్సహించాలన్నారు.
తెలంగాణలో గొప్ప సాంస్కృతిక వారసత్వ చరిత్ర కలిగి ఉందన్నారు. ఈజ్‌ఆఫ్‌డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం అత్యుత్తమంగా ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఈ ఎక్స్పోలను సందర్శించి, వాటి ఆవశ్యకతలను చెప్పాలన్నారు. ఈ రెండు ఎక్స్‌పోలలో 150 మంది ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ తెలిపారు.