ఇంటర్‌‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్య ..జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన

ఇంటర్‌‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్య ..జగిత్యాల జిల్లా  కోరుట్ల పట్టణంలో ఘటన

కోరుట్ల, వెలుగు : జీవితంపై విరక్తితో ఓ ఇంటర్‌‌ స్టూడెంట్‌‌ సూసైడ్‌‌ చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణం భీమునిదుబ్బ ప్రాంతానికి చెందిన వడ్లకొండ వశిష్ట (16) పుట్టుకతోనే దివ్యాంగుడు. ఇతడు ప్రస్తుతం కరీంనగర్‌‌‌‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌‌‌‌ చదువుతున్నాడు. 

వశిష్టకు కంటి సమస్య రావడంతో... తండ్రి మురళి రెండు రోజుల కింద ఇంటికి తీసుకు వచ్చాడు. కాగా వశిష్ట తన అంగవైకల్యం, అనారోగ్యం విషయంలో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.