ఢిల్లీ: భారతదేశంలో డేటా సెంటర్ల మౌలిక సదుసాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భారత్‌ను గ్లోబల్ డిజిటల్ హాట్‌గా మార్చే లక్ష్యంతో ఆర్థికమంత్రి గణనీయమైన రాయితీని ఇచ్చారు. 2047 వరకు డేటా సెంటర్ల ద్వారా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు టాక్స్ హాలీడే ప్రకటించారు. తద్వారా ఆయా కంపెనీలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
ALSO READ : డిఫెన్స్ బడ్జెట్ 7 లక్షల కోట్లు: ఆపరేషన్ సింధూర్ తర్వాత లక్ష కోట్లు పెంపు.. కానీ కుప్పకూలిన స్టాక్స్
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను భారత్లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అయితే ఈ టాక్స్ హాలీడే పొందాలంటే విదేశీ కంపెనీలు ఇండియాలోని ఏదైనా సంస్థతో జతకట్టి వారి సేవలను కస్టమర్స్‌కు అందించాలి. తద్వారా అలా జతకట్టిన భారతీయ కంపెనీలకు 1.5% సేఫ్ హార్బర్ లాభం చేకురుతుందని తెలిపారు.
