కేంద్ర బడ్జెట్2026పై ప్రతి పక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోలే దన్నారు.ఈ బడ్జెట్ లో యువత, రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. యువత ఉపాధి అవకాశాలు, రైతు సమస్యలు,మధ్యతరగతి, ఎంఎస్ ఎంఈలకు తగిన పరిష్కారం చూపకుండా రైతులు, యువతను విస్మరించిందని సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించారు.
యువత ఉద్యోగ ఉపాధి లేదు.. తయారీ రంగం పడిపోయింది..పెట్టుబడి దారులు మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు.. పొదుపు క్షీణించిం.. రైతులు కష్టాల్లో ఉన్నారు.. ప్రపంప దేశాలనుంచి షాకుల మీద షాకులు.. బడ్జెట్ లో ఏమాత్రం దృష్టి పెట్టలేదు.. దేశంలో అసలైన సంక్షోభాల దిద్దుబాటును విస్మరించారని సోషల్ మీడియాX లో పోస్ట్ షేర్ చేశారు రాహుల్ గాంధీ.
►ALSO READ | Budget 2026: వికసిత్ భారత్ కోసం సరికొత్త బ్యాంకింగ్ కమిటీ.. ఔషధ రంగాలకు భారీ నిధులు!
దేశంలో వాస్తవ సంక్షోభాలను కేంద్ర బడ్జెట్ పట్టించుకోలేదన్నారు రాహుల్ గాంధీ. ఈ బడ్జెట్ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, ఇది కేవలం కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చేలా ఉందని విమర్శించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యలను ఈ బడ్జెట్ విస్మరించిందన్నారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇది దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందన్నారు రాహల్ గాంధీ.
అంతకుముందుకు ముందు పార్లమెంటు వెలుపల కేంద్ర బడ్జెట్ పై మాట్లాడేందుకు రాహుల్ గాంధీ తిరస్కరించారు. సోమవారం పార్లమెంటులోనే మాట్లాడతానని చెప్పారు.
