ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2026లో వ్యవసాయ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్ కీలక ప్రకటన చేశారు. రైతులకు మల్టీలింగ్వల్ ఏఐ ఆధారిత వ్యవసాయ టూల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. పంట ఎంపిక, సాగు ప్రణాళిక, వాతావరణ హెచ్చరి కలు, పురుగుల నియంత్రణ, మార్కెట్ ధరల సమాచారం వంటి అంశాల్లో ఈ ఏఐ టూల్ రైతులకు ప్రాంతీయ భాషల్లో మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు.
రైతుల ఆదాయం పెంచే దిశగా కొబ్బరి, చందనం, వాల్నట్ వంటి హై వాల్యూ పంటలకు కేంద్ర మద్దతు ప్ర కటించారు. చందనం ఎకోసిస్టమ్ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్ర భుత్వాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. కొబ్బరి సాగులో ఉత్పాద కత పెంచేందుకు ప్రత్యేక పథకం, అలాగే కాజూ, కోకో రంగాలకు జాతీయ ప్రోగ్రామ్ను ప్రకటించారు. పశుసంవర్ధక రంగంలో క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ, లైవ్క్ ఎఫ్పీవోలకు ప్రో త్సాహంతో గ్రామీణ ఉపాధికి కొత్త ఊపునివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
►ALSO READ | 81 నిమిషాల్లోనే బడ్జెట్ ప్రసంగం ముగించిన నిర్మలమ్మ.. గతంతో పోల్చితే తక్కువే..!
