భవిత స్కూళ్లకు కొత్త బిల్డింగ్లు .. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 17 భవనాలు సాంక్షన్

భవిత స్కూళ్లకు కొత్త బిల్డింగ్లు .. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 17 భవనాలు సాంక్షన్
  •  రాష్ట్ర వ్యాప్తంగా 602 స్కూళ్లకు పక్కా బిల్డింగ్స్​ 
  • ఆరు పాత స్కూళ్ల రిపేర్లకు స్పెషల్​ ఫండ్స్​
  • స్టడీ మెటీరియల్స్​ పంపిణీపై కలెక్టర్​ చొరవ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దివ్యాంగులైన చిన్నారుల చదువులకు పునాదులు వేస్తున్న భవిత స్కూళ్లకు మంచి భవిష్యత్​ రానుంది. గత పదేండ్ల కాలంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం భవిత స్కూళ్లను పట్టించుకోలేదు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్​ రెడ్డి భవిత స్కూళ్ల​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా భవిత స్కూల్స్​కు పక్కా భవనాలు నిర్మించేందుకు ఫండ్స్​ రిలీజ్​ చేశారు. గతంలో ఉన్న పక్కా బిల్డింగుల రిపేర్ల కోసం ఫండ్స్​ సాంక్షన్​ చేశారు.  

ఇన్నాళ్లు కనీస సౌకర్యాలు కరువు.. 

దివ్యాంగులైన చిన్నారుల కోసం 15 ఏళ్ల కింద ఏర్పాటు చేసిన భవిత స్కూళ్లలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు. సరైన స్కూల్​ బిల్డింగ్​లు లేకపోవడంతో గవర్నమెంట్​ స్కూల్స్​లలోని వరండాల్లో, ఇతర ఇరకు గదుల్లో కాలం వెళ్ల దీస్తూ వచ్చారు. కనీసం వారికి టాయి​లెట్స్​ లేకపోవడంతో స్కూల్​కు​ వచ్చేందుకు దివ్యాంగ స్టూడెంట్స్​ఇంట్రస్ట్​ చూపలేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి ఈ స్కూళ్లపై, దివ్యాంగుల చదువులపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. భవిత సెంటర్లపై నివేదికలు తెప్పించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 602 భవిత స్కూల్స్​కు ఫండ్స్​ రిలీజ్​ చేశారు. ఒక్కో స్కూల్​కు స్పెషల్​ టాయి​లెట్లతో కలిపి రూ. 8లక్షల చొప్పున నిధులు రిలీజ్​ చేస్తూ వారం రోజుల కిందట ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం భవిత స్కూల్స్​ కు పక్కా బిల్డింగ్​లు ఉన్న వాటికి రిపేర్ల కోసం రూ. 1.50లక్షల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 17 స్కూళ్లు 

జిల్లా వ్యాప్తంగా 23 మండలాలున్నాయి. ఒక్కో మండలానికి ఒక్కో భవిత​ స్కూల్​ను ప్రభుత్వం సాంక్షన్​ చేసింది. ఈ స్కూల్​​తో పాటు గవర్నమెంట్​ స్కూళ్లలో 2,425 మంది దివ్యాంగ చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు.  కాగా జిల్లాలో ఆరు చోట్ల మాత్రమే భవిత స్కూల్స్​ కు పక్కా బిల్డింగ్​లున్నాయి. కానీ వీటిలో టాయ్​లైట్లు సరిగా లేవు. కొన్ని చోట్ల బిల్డింగ్​లు శిథిలావస్థకు చేరాయి. పాత బిల్డింగ్​లకు రిపేర్లు, టాయ్ లెట్లకు ఒక్కో స్కూల్​కు రూ. 1.50లక్షల చొప్పున ప్రభుత్వం ఫండ్స్​ ఇచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం గవర్నమెంట్​ స్కూళ్లలో అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతున్న 17 మండలాలకు గానూ 17 పక్కా బిల్డింగ్​లను నిర్మించేందుకు ప్రభుత్వం ఒక్కో స్కూల్​ బిల్డింగ్​కు రూ. 7లక్షలు, టాయి​లెట్ల కోసం రూ. లక్ష చొప్పున నిధులు మంజూరు చేసింది. దీంతో దివ్యాంగుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కలెక్టర్ ​ప్రత్యేక చొరవ..

జిల్లాలోని దివ్యాంగ స్కూల్స్​పై కలెక్టర్​ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇటీవల కొత్తగూడెం పట్టణం రైటర్​ బస్తీలోని భవిత స్కూల్​ను ఆయన సందర్శించారు. అవసరమైన ఫర్నీచర్​తో పాటు స్టూడెంట్స్​కు అవసరమైన స్టడీ మెటీరియల్​కు ఫండ్స్​ ఇస్తానని ప్రకటించారు. దివ్యాంగ స్టూడెంట్స్​కు ఏమేమి అవసరమో నివేదికలు ఇవ్వాలని కో ఆర్డినేటర్​ను ఆదేశించారు. 

ఇక దివ్యాంగ స్టూడెంట్స్​కు మంచి భవిష్యత్​

ఇప్పటి వరకు అరకొర సౌకర్యాల మధ్యనే దివ్యాంగ స్టూడెంట్స్​ చదవులు కొనసాగించారు. ఇక దివ్యాంగ స్టూడెంట్స్​కు మంచి భవిష్యత్ రానుంది.​ప్రభుత్వం ప్రత్యేకంగా భవిత స్కూళ్ల​ కోసం పక్కా బిల్డింగ్​ల నిర్మాణాలు చేపట్టడం హర్షనీయం. ఇప్పటికే జిల్లాలోని వందల సంఖ్యలో స్టూడెంట్స్​కు కావాల్సిన పరికరాలను పంపిణీ చేశాం. –  సైదులు, భవిత సెంటర్స్​ జిల్లా కో ఆర్డినేటర్​, భద్రాద్రికొత్తగూడెం