V6 News

భూ వివాదాలు.. హైదరాబాద్ కుల్సుంపుర ACP పై వేటు..

 భూ వివాదాలు.. హైదరాబాద్  కుల్సుంపుర ACP పై వేటు..

హైదరాబాద్ కుల్సుంపుర స్టేషన్ కు చెందిన మరో పోలీసు అధికారిపై వేటు పడింది. భూ వివాదాలు, అవినీతి, ఆరోపణలు, కేసుల తారుమారుపై  కుల్సుంపుర ACP మునావర్ పై వేటు వేశారు. ఆయనను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. 

కుల్సుంపుర ఏసీపీ వ్యవహార శైలిపై చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. తన మాట వినని పోలీస్ సిబ్బందిని పరువు తీసేల వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఏసీపీ మునావర్ వ్యవహారం పై సీపీ సజ్జనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదే కేసులో హైదరాబాద్  కుల్సుంపుర పోలీస్ స్టేషన్  సీఐ సునీల్ పై ఇటీవలే సస్పెన్షన్ వేటు పడింది.  ఓ కేసులో నిందితుల పేర్లు మార్చి వారికి ఫేవర్ చేశారనే ఆరోపణలు రావడంతో సీఐ సునీల్ ను సస్పెండ్ చేశారు సీపీ సజ్జనార్.  నిందితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పేర్లు మార్చారని  అంతర్గత విచారణలో తేలడంతో సునీల్ పై చర్యలు తీసుకున్నారు. 

నెల క్రితం  టప్పాచబుత్రా సీఐ 

2025 నవంబర్ 1న సిటీలోని టప్పాచబుత్రా సీఐ బి.అభిలాశ్​ను సస్పెండ్​చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.  గంగాబౌలి ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్​చేస్తుండగా, కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన కూర్చొని ఉన్నారు.  వీరిని చూసిన కానిస్టేబుల్స్​అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరగా వినలేదు. పైగా సదరు వ్యక్తులు కానిస్టేబుల్స్​ను దుర్భాషలాడారు. స్టేషన్​కు వెళ్లిన కానిస్టేబుల్స్​విషయాన్ని సీఐ అభిలాశ్​కు చెప్పినా యాక్షన్​తీసుకోలేదు. తర్వాత వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, ఎంక్వైరీ చేశారు. అది నిజమేనని తేలడంతో సీపీ సస్పెండ్ చేశారు.