హైదరాబాద్ ఎల్బీనగర్ మైనర్పై లైంగిక దాడి.. పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు..

హైదరాబాద్ ఎల్బీనగర్ మైనర్పై లైంగిక దాడి.. పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు..

హైదరాబాద్ ఎల్బీనగర్ లో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో రమేష్ అనే వ్యక్తికి జీవితఖైదు విదించింది కోర్టు. పోక్సో చట్టం ప్రకారం బుధవారం (జులై 16) ఆంబోతు రమేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించింది. అదే విధంగా రూ. 25,000/- జరిమానా విధించింది. లైంగిక దాడి బాధితురాలికి రూ.10 లక్షలు పరిహారం మంజూరు చేసింది  ఎల్ నగర్ ఫాస్ట్ ట్రాక్ బీ కోర్టు. 

ఎల్బీనగర్ లో మంగళవారం (జులై 15) కూడా పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, పలుమార్లు అత్యాచారం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి ఎల్బీనగర్ స్పెషల్ పోక్సో కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసులు, పీపీ తెలిపిన ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వెంకటాద్రి పాలెంకు చెందిన శివరాత్రి మల్లేశ్(40) మీర్ పేట పరిధిలోని అల్మాస్ గూడలో నివాసం ఉంటూ డైలీ లేబర్ గా పనిచేస్తున్నాడు. 

2019లో స్థానికంగా ఉండే ఓ బాలికకు మాయమాటలు చెప్పి, శారీరకంగా లొంగతీసుకున్నాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి అయిన తర్వాత ఆమె ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక ఆత్మహత్యకు పాల్పడింది. 

మల్లేశ్ పై అనుమానం వ్యక్తం చేస్తూ మీర్ పేట పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి ఆధారాలతో ఎల్బీనగర్ లోని స్పెషల్ పోక్సో కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన కోర్టు మల్లేశ్​ను నేరస్తుడిగా తేల్చి, సోమవారం జీవిత ఖైదు విధించింది. బాధితురాలి తండ్రికి రూ.2 లక్షల పరిహారం ప్రభుత్వం అందించాలని ఆదేశించింది.