హైదరాబాదీలకు ముందు జాగ్రత్త ఎక్కువే.. ఇన్సూరెన్స్ యాడాన్ కొనుగోళ్లలో టాప్

హైదరాబాదీలకు ముందు జాగ్రత్త ఎక్కువే.. ఇన్సూరెన్స్ యాడాన్ కొనుగోళ్లలో టాప్

దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ రంగంలో కొత్త ధోరణి స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఎక్కువ మంది తమ ఇన్సూరెన్స్ పాలసీలకు అదనపు రక్షణలైన క్రిటికల్ ఇల్లెనెస్ రైడర్‌లు, డిసేబిలిటీ కవర్, ఆక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, ప్రీమియం వైవర్ వంటి ఆడ్ఆన్‌లను యాడ్ చేసుకుంటున్నారు. ఈ మార్పును ప్రధానంగా ఆధునిక సిటీ లైఫ్  స్టైల్ మార్పులు, ఆరోగ్య సమస్యల పెరుగుదల, ఆర్థిక భద్రతపై పెరుగుతున్న అవగాహన ప్రేరేపిస్తున్నట్లు వెల్లడైంది. 

ఈ లిస్టులో దేశంలో హైదరాబాద్ నగరం ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోను అత్యధికంగా అదనపు రక్షణతో కూడిన పాలసీలను కొనుగోలు చేస్తున్న ప్రజలు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇక్కడ పాలసీదారుల్లో సగానికి పైగా వారు తమ ప్రాథమిక టర్మ్ లేదా లైఫ్ ఇన్స్యూరెన్స్‌కు అదనపు యాడాన్ కవర్లను కొంటున్నట్లు డేటా వెల్లడించింది. ముఖ్యంగా యువత, శాలరీడ్ ఉద్యోగులు ఎక్కువగా విస్తృతమైన రక్షణ కోసం ఇలాంటి పద్ధతులను ఫాలో అవుతున్నారని తేలింది. 

దక్షిణ భారత నగరాల్లో బెంగళూరు, కొచ్చి వంటి పట్టణాల్లో కూడా ఈ ఆడ్ఆన్ పాలసీలకు మంచి ఆదరణ కనిపిస్తున్నా.. హైదరాబాద్ మాత్రం లిస్టులో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నగరంలోని పురుషులు ఎక్కువగా యాక్సిడెంట్ లేదా డిసెబిలిటీ రైడర్‌లను ఎంచుకుంటున్నారని తేలింది. ఇక మహిళలు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను కవర్ చేసే క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని తేలింది. గతంలో కేవలం ప్రాథమిక పాలసీలకే పరిమితమైన వినియోగదారులు పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు, అస్థిరంగా ఉన్న జాబ్ మార్కెట్ వంటి పరిస్థితుల దృష్ట్యా అదనపు సేఫ్టీకి మెుగ్గుచూపుతున్నట్లు తేలింది. 

ALSO READ : హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రేట్లు తగ్గబోతున్నాయ్..

యాడాన్ రైడర్ల కొనుగోలులో ఎవరు ఎలా ఉన్నారు..
దక్షిణాది రాష్ట్రాలు నిరంతరం ఇన్సూరెన్స్ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. యాక్సిడెంటర్ పర్మనెంట్ డిసెబిలిటీ, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్ రైడర్‌లతో 45–47% వరకు ఉన్న అత్యధిక రైడర్ కొనుగోళ్లు దీనిని సూచిస్తున్నాయి. ఈస్ట్ రాష్ట్రాల్లో 32–34% వద్ద నిలకడగా ఉన్నా, పశ్చిమ భారతదేశం (ముంబై, పూణే, అహ్మదాబాద్‌) 30–31% వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర భారతదేశం మాత్రం కేవలం 21–23% వద్ద ఉండి. మెుత్తానికి సౌత్ స్ట్రేట్స్ ఎక్కువ అవగాహనతో యాడాన్ రైడర్ల కొనుగోలులో ముందంజలో ఉన్నాయని డేటా చెబుతోంది.