హల్దీ వేడుకలో గుండె పోటుతో వ్యక్తి మృతి

హల్దీ వేడుకలో గుండె పోటుతో వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఓ'హల్దీ' వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వివాహ క్రతువులో పాల్గొన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం అందర్నీ కలిచివేసింది. ఫిబ్రవరి 20న నగరంలోని కాలా పత్తర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరణించిన వ్యక్తిని 40 ఏళ్ల మహ్మద్ రబ్బానీగా గుర్తించిన పోలీసులు.. అతను నగల దుకాణంలో పనిచేస్తున్నట్టు తెలిపారు. 'హల్దీ' వేడుకలో జరిగిన ఈ ఘటనకు సంబందించిన ఈ వీడియోలో  వరుడి పాదాలపై పసుపును పూయడానికి రబ్బానీ రెడీగా కూర్చొని ఉన్నారు. అతిథులతో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఈ టైంలోనే సడెన్ గా రబ్బానీ నేలపై కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన బంధువులు అతన్ని లేపడానికి ప్రయత్నించారు. ఎంతకీ లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన మరుసటి రోజు అతను మరణించాడు. దీంతో రిబ్బానీ వివాహం కూడా వాయిదా పడింది.