
అల్వాల్ శ్రీకాంత్ రెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ప్రధాన నిందితుడు కనక రాజు పై శ్రీకాంత్ రెడ్డి తమ్ముడు స్టీఫెన్ అనుమానం వ్యక్తం చేయడంతో.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా శ్రీకాంత్ రెడ్డి ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు . ఈ ఏడాది జనవరిలో తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్నఓ మహిళతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పాల్వంచ పారిపోవడంతో.. కనకరాజు అతనిపై కోపం పెంచుకొని , చిత్రహింసలకు గురి చేసి చంపినట్టు విచారణలో వెల్లడైంది. బాధితురాలు సోదరుడు చంద్ర శేఖర్ తో కలిసి కనక రాజు ఈ హత్య చేశాడు.
శ్రీకాంత్ రెడ్డిని నలభై ఐదు రోజుల పాటు దమ్మాయిగూడెంలోని ఓ అపార్ట్మెంట్ లో బంధించిన కనకరాజు.. అతను పారిపోకుండా ఇద్దరు మేస్త్రీలు కాపలా పెట్టాడు. తరచుగా కనకరాజు ఆ అపార్ట్మెంట్ కు వచ్చి శ్రీకాంత్ రెడ్డిని హింసిస్తుండేవాడు. ఈ క్రమంలో డిసెంబర్ 6 వ తేదిన కనకరాజుకు శ్రీకాంత్ రెడ్డికి మధ్య వాగ్వివాదం పెరిగింది. ఆ కోపంలో తాడుతో గొంతు నులిమి, చంద్ర శేఖర్ తో కలసి హత్య చేశాడు. ఆ తరువాత షిఫ్ట్ కారులో మృత దేహాన్ని తీసుకొని అస్మాత్ పెట్ స్మశాన వాటిక కు తీసుకొచ్చి, స్మశాన వాటిక లో పని చేసే రాజేష్ అనే వ్యక్తి సహాయం తో అనాధ శవం అని చెప్పి పూడ్చి పెట్టారు.
శ్రీకాంత్ రెడ్డి ని చంపే ముందు కనక రాజు అతనికి సర్ది చెప్పి, వార్నింగ్ ఇచ్చినా.. ఒప్పుకోక పోవడంతో ఈ హత్య చేశాడు. ప్రస్తుతం బాధితురాలు మచిలీపట్నం లో ఉంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసింది. ద్యం మత్తులో ఇటీవల స్నేహితుల మధ్య కనకరాజు నోరు జారడంతో సమాచారం అందుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా కనకరాజు హత్య కేసు బయటకు వచ్చింది.