మండీ రెస్టారెంట్లల్లో ఎలుకలు బొద్దింకలు

మండీ రెస్టారెంట్లల్లో ఎలుకలు బొద్దింకలు
  • ఫుడ్ ​సేఫ్టీ అధికారుల తనిఖీల్లో గుర్తింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని పలు మండీ రెస్టారెంట్లు శుభ్రతను పాటించడం లేదని పుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. రెస్టారెంట్ల కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నాయని, కుళ్లిన చికెన్ తో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారని తేలింది. మండీ రెస్టారెంట్లు శుభ్రతను పాటించడం లేదని ఇటీవల పలువురు కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని అరేబియన్ మండీ–36, ఖైరతాబాద్ లోని మండీ టౌన్, మండీ కింగ్, రాయల్ రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతోపాటు ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నట్టు గుర్తించారు. వంటల్లో పాడైన చికెన్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని తేల్చారు.