హైదరాబాద్ మెడికల్ షాపుల్లో నకిలీ మందులు

హైదరాబాద్ మెడికల్ షాపుల్లో నకిలీ మందులు

హైదరాబాద్ లో  లైసెన్స్ లేకుండా మెడికల్ షాపు నడుపుతున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.  వారి నుంచి 3లక్షల 20 వేల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు

సంతోష్ నగర్ ఐఎస్ సదన్‌లో డ్రగ్స్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న మెడికల్ షాపుపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు.  భారీగా నిల్వ ఉంచిన మందులను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు  3.20 లక్షలు ఉంటుందన్నారు.

మహమ్మద్ ఇల్తేఫత్ అహ్మద్ ఐఎస్ సదన్ అనే వ్యక్తి సంతోష్ నగర్‌లో అక్రమంగా మెడికల్ షాపు నడుపుతూ.. భారీగా మందులు నిల్వ ఉంచాడు. అల్ప్రాజోలం, క్లోనాజెపామ్, క్లోర్డియాజెపాక్సైడ్ , ట్రామాడాల్  సహా 111 రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  డ్రగ్స్ లైసెన్స్ లేకుండా మందులు అమ్మడం, నిల్వ ఉంచడం నేరం.   డ్రగ్స్ లైసెన్స్ లేకుండా మందులను నిల్వ ఉంచితే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.