మొత్తానికి మెట్రో దిగొచ్చింది.. పెంచిన టికెట్ ధరలపై 10 శాతం డిస్కౌంట్.. 

మొత్తానికి మెట్రో దిగొచ్చింది.. పెంచిన టికెట్ ధరలపై 10 శాతం డిస్కౌంట్.. 

ఇటీవల హైదరాబాద్ లో మెట్రో టికెట్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.. టికెట్ ధరలపై పెంపుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలు చోట్ల నిరసనలు కూడా తెలిపాయి ప్రజాసంఘాలు... పెంచిన మెట్రో టికెట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశాయి. మినిమమ్ టికెట్ ధర రూ. 10 నుంచి రూ. 12 కి, కనిష్ట టికెట్ ధరను రూ. 60 నుంచి రూ. 75 కి పెంచింది ఎల్ అండ్ టీ. దీంతో రోజూ మెట్రోలో ప్రయాణించేవారి మీద భారం పడ్డట్టయ్యింది. మెట్రో టికెట్ ధరలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు దిగొచ్చింది ఎల్ అండ్ టీ. పెంచిన ధరలపై 10 శాతం రాయితీ ప్రకటించింది ఎల్ అండ్ టీ. 

ప్రస్తుతం పెంచిన చార్జీలలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది ఎల్ అండ్ టీ. మే 24వ తేదీ నుంచి రాయితీలు వర్తిస్తాయని తెలిపింది. మెట్రో యాజమాన్యం తాజా నిర్ణయం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమపై భారం పడకుండా 10 శాతం రాయితీ ప్రకటించినందుకు ఎల్ అండ్ టీ సంస్థకు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు ప్రయాణికులు.

ప్రస్తుతం మెట్రో సేవలు హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్ఎల్), ఎల్ అండ్ టీ— మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్(ఎంఆర్ హెచ్ఎల్) ఆధ్వర్యంలో పీపీపీ మోడల్లో నడుస్తున్నాయి. 2017 నవంబర్ 28న ప్రారంభమైన హైదరాబాద్మెట్రో 67 కి.మీ. నెట్వర్క్తో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. అయితే, కొవిడ్ టైంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడం, ఆపరేషనల్ ఖర్చులు పెరగడంతో మెట్రో అప్పులు రూ.6,598 కోట్లకు చేరాయి.

ఆపరేషనల్ ఖర్చులు160 శాతం పెరగడంతో టికెట్ల రేట్లు పెంచక తప్పట్లేదని అధికారులు చెబుతున్నారు. మెట్రో రైల్వే(ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) చట్టం, 2002లోని సెక్షన్ 34 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 5న ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ గుడిసేవ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన, కేంద్ర ప్రభుత్వం నుంచి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ ఆర్బన్ అఫైర్స్ అడిషనల్ సెక్రటరీ సురేంద్ర కుమార్ బార్డే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పటి ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కూడిన కమిటీ 2023 జనవరి 25న నివేదిక సమర్పించింది. కమిటీ సిఫారసులు సెక్షన్ 37 ప్రకారం మెట్రోకు ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది.