ఆగష్టు 30న 11:45 దాకా నడవనున్న మెట్రో

ఆగష్టు 30న 11:45 దాకా నడవనున్న మెట్రో

హైదరాబాద్, వెలుగు: వినాయకుడి భక్తులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. గణేశ్ఉత్సవాలు, వీకెండ్ కావడంతో నేడు (శనివారం) అర్ధరాతి 11:45 గంటల వరకు మెట్రో నడవనుంది. ప్రతి మెట్రో స్టేషన్ నుంచి చివరి రైల్ 11:45 వరకు అందుబాటులో ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం సమయాన్ని పొడిగించినట్లు, భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని శుక్రవారం మెట్రో ప్రకటన విడుదల చేసింది.