మరోమారు మొరాయించిన మెట్రో రైలు

మరోమారు మొరాయించిన మెట్రో రైలు

హైదరాబాద్ మెట్రో రైలు మరోమారు మొరాయించింది. సాంకేతిక లోపం తలెత్తడంతో సుమారు గంటపాటు నిలిచిపోయింది .మెట్రోరైలు అధికారులపై , తెలంగాణ ప్రభుత్వంపై నగర వాసులు మండిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగోల్ నుంచి అమిర్ పేట వైపు వస్తున్న ఓ మెట్రో రైల్లో సాంకేంతిక లోపం తలెత్తింది. దీంతో ట్రైన్ ను ప్యారడైజ్ మెట్రో స్టేషన్ లో సుమారు గంటపాటు నిలిపివేశారు. అయితే సాంకేతిక లోపం తలెత్తడంపై  ప్రయాణికులు మండిపడుతున్నారు. వారంలో పలుమార్లు సాంకేతిక లోపాలు తలెత్తడం, మెట్రో స్టేషన్ల గోడల మీద భారీ పగుళ్లు రావడం, అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి ఓ మహిళ మృతి చెందడంపై మెట్రోరైల్లో ప్రయాణంపై నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.