చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైలు

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైలు

హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. 2017 నవంబర్ 29 మెట్రో రైలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణించారని  హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డివెల్లడించారు. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు.4.90 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. మరి కొన్ని రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలు దాటుతుందన్నారు. రోజుకు 6.70 లక్షలమంది ప్రయాణం చేసేందుకు అనుగుణంగా మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 1000 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా వేశారు.   ప్రస్తుతం ప్రతి రోజు  1.20 లక్ష మంది విద్యార్థులు, 1.40 లక్షల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మెట్రో జర్నీ చేస్తున్నారని తెలిపారు.