గుడ్ న్యూస్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉగాది ఆఫర్

గుడ్ న్యూస్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉగాది ఆఫర్

ఉగాది సందర్భంగా మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.  ప్రయాణ ఆఫర్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.  మెట్రో రైలులో ప్యాసింజర్ ఆఫర్‌ లు  సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ కార్డులను ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఎల్అండ్ టీ ప్రకటించింది.  

మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్టు.. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ వెనక్కి తగ్గిన యాజమాన్యం మరో నెలలు ఈ ఆఫర్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

అలాగే ఎల్‌&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్   సరికొత్త కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.  తరచుగా మెట్రోలో  ప్రయాణించే వారికి  ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎంత ఎక్కువగా మెట్రో సేవలు వినియోగించుకుంటే అన్ని ఎక్కువ రివార్డులు పొందవచ్చు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో స్పెషల్  కస్టమర్ లాయల్టీ స్టాల్  ఏర్పాటు చేశారు.  ఇక్కడ లాయల్టీ ఫ్రోగ్రామ్ కు అర్హత కల్గిన ప్రయాణికులు   తమ రివార్డ్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు.