కన్నడిగుల కొత్త నినాదం.. హిందీవాలా ఆటోస్ గోబ్యాక్ అంటూ బెంగళూరులో రచ్చ..

కన్నడిగుల కొత్త నినాదం.. హిందీవాలా ఆటోస్ గోబ్యాక్ అంటూ బెంగళూరులో రచ్చ..

కర్ణాటక ప్రజలకు తమ భాషతో పాటు తమ సంస్కృతిపై  ఉన్న ఎనలేని అభిమానం గురించి మనకు తెలిసిందే. దీనికి తోడు చాలా కాలం నుంచి స్థానిక ప్రజలకు ఉపాధి అనే మరో అంశం కూడా వారి మదిలో అలాగే నాటుకుపోయింది. పెద్ద ఉద్యోగం అయినా లేక చిన్న రోజువారీ పని అయినా తమ నేలపై తమ వారికే దక్కాలనే ఆలోచన చాలా మంది కన్నడిగుల్లో ఉంది. 

ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరులో కొత్త నినాదం ఊపిరి పోసుకుంది. కన్నడ మాట్లాడని ఆటోవాలాలు అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చి ఉపాధి పొందుతున్న వారిని టార్గెట్ చేస్తూ ఆటోల వెనుక స్కిక్కర్లు వెలియటంపై దుమారం కొనసాగుతోంది. అనధికారికంగా ఆటోలు నడుపుతున్న హిందీవాలాస్ గో బ్యాక్ అంటూ అందులో ఉంది. పర్మిట్లు, పోలీస్ వెరిఫికేషన్, డిస్ ప్లే, బ్యాడ్జి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు కూడా ఆటోలు నడుపుతున్నారంటూ అందులో ఉంది. బెంగళూరులోని కేఆర్ పురమ్, మహదేవ్ పురా ప్రాంతాల్లో దాదాపు ఇలాంటి ఆటోల సంఖ్య 10 వేలకు పైనే ఉన్నాయని స్టిక్కర్లో ఉంది. 

సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతుండటంతో చాలా మంది తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఇలాంటి స్టిక్కర్లు చూడటం బాధగా ఉందని, మరీ ఇంత విద్వేషం పరికిరాదంటూ నమ్మబెంగళూరు అనే అకౌంట్లో పోస్టుపై క్యాప్షన్ పెట్టబడింది. కొందరు యూజర్లు ఉపాధి కోసం వచ్చిన వ్యక్తులు స్థానిక బాషతో పాటు కల్చర్ నేర్చుకుంటే సరిపోతుందని దీనికోసం ఇలా పోస్టర్లు వేసి మరీ రచ్చ చేయటం సరికాదని అంటున్నారు. 

మరో వ్యక్తి మాట్లాడుతూ అందరూ సొంత కార్లలో ప్రయాణం వల్ల ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయని, బెంగళూరులో ప్రజలు విచక్ష కోల్పోయి ప్రవర్తిస్తున్నారన్నారు. జంతువులు కూడా మనుషుల కంటే మంచిగా కలిసి జీవిస్తున్నాయని రాసుకొచ్చారు. మరొకరు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బెంగళూరు ప్రస్తుతం వివాదాలకు అడ్డాగా మారిందటూ పోస్ట్ చేశారు. మరొకరు బెంగళూరు ప్రత్యేక దేశంగా కొందరు ఫీలవుతున్నారని.. ఇతర ప్రాంతాల ప్రజలపై ఇలా విషం కక్కటం సరికాదంటూ పోస్ట్ పెట్టారు. బెంగళూరులో ఆటో డ్రైవర్లు మీటర్లు లేకుండా నడపటం అక్రమం కాదా అంటూ మరొకరు ప్రశ్నించారు. మరొకరు చట్టాన్ని ఫాలో అవ్వని వారినే కదా స్టిక్కర్లో టార్గెట్ చేసింది అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.