ఈ 65 కార్ల ధరలు భారీగా తగ్గాయి.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందో ఫుల్ లిస్ట్ ఇదే..

ఈ 65 కార్ల ధరలు భారీగా తగ్గాయి.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందో ఫుల్ లిస్ట్ ఇదే..

GST 2.O.. నిత్యావసరాల ధరలు ఎంత తగ్గుతాయో ఏమో స్పష్టత రాలేదు. కానీ కార్ల ధరలపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఏ కారు ధర ఎంత తగ్గుతుందో ఫుల్ లిస్ట్ వచ్చింది. కంపెనీ మోడల్, తగ్గిన ధర ఎంతో తెలుసుకుందామా..

మహీంద్రా కంపెనీ: బొలెరో నియో రూ. 1 లక్ష 27 వేలు, XUV 3XO పెట్రోల్ మోడల్ రూ. 1లక్ష 40 వేలు & డీజిల్ మోడల్ రూ. 1లక్ష 56 వేలు, థార్ రేంజ్ రూ. 1లక్ష 35 వేలు వరకు, థార్ రోక్స్ రూ. 1లక్ష 33 వేలు, స్కార్పియో క్లాసిక్ రూ. 1లక్ష 01 వేలు, స్కార్పియో ఎన్ రూ. 1లక్ష 45 వేలు, XUV700 రూ. 1లక్ష 43 వేలు ధర తగ్గింది. 

టాటా మోటార్స్ : టియాగో రూ. 75వేలు,  టిగోర్ రూ. 80వేలు, ఆల్ట్రోజ్ రూ. 1 లక్ష10 వేలు, పంచ్ రూ. 85 వేలు, నెక్సాన్ రూ. 1లక్ష55 వేలు, హారియర్ రూ. 1లక్ష40 వేలు, సఫారీ: రూ. 1లక్ష45 వేలు, కర్వ్  రూ. 65 వేలు తగ్గింది. 

ALSO READ : మీ ఫోన్ లో చిన్న చిప్ వేసుకుంటే చాలు..

రేంజ్ రోవర్  కార్ల పై రూ. 30.4 లక్షల వరకు ధర తగ్గింది
4.4P SV LWB: రూ. 30.4 లక్షలు 
3.0D SV LWB: రూ. 27.4 లక్షలు 
3.0P ఆటోబయోగ్రఫీ: రూ. 18.3 లక్షలు  
3.0D HSE: రూ. 16.5 లక్షలు 
రేంజ్ రోవర్ స్పోర్ట్ - రూ. 19.7 లక్షలు 
4.4 SV ఎడిషన్ టూ: రూ. 19.7 లక్షలు  
4.4 ఆటోబయోగ్రఫీ: రూ. 14.1 లక్షలు 
3.0D/3.0P డైనమిక్ HSE: రూ. 9.8 లక్షలు 
రేంజ్ రోవర్ వెలార్ - రూ. 6 లక్షల వరకు  
2.0D/2.0P ఆటోబయోగ్రఫీ: రూ. 6 లక్షలు 
రేంజ్ రోవర్ ఎవోక్ - రూ. 4.6 లక్షలు 
2.0D/2.0P ఆటోబయోగ్రఫీ: రూ. 4.6 లక్షలు 
డిఫెండర్ - రూ. 18.6 లక్షల వరకు తగ్గింపు
4.4P 110 OCTA ఎడిషన్ వన్: రూ. 18.6 లక్షలు 
4.4P 110 OCTA: రూ. 17.3 లక్షలు 
5.0P 110 X-డైనమిక్ HSE: రూ. 9.9 లక్షలు 
3.0D 110 X-డైనమిక్ HSE: రూ. 9 లక్షలు 
2.0P 110 X-డైనమిక్ HSE: రూ. 7 లక్షలు 
డిస్కవరీ - రూ. 9.9 లక్షల వరకు 
3.0D టెంపెస్ట్: రూ. 9.9 లక్షలు 
3.0D డైనమిక్ HSE: రూ. 9.3 లక్షలు 
డిస్కవరీ స్పోర్ట్ - రూ. 4.6 లక్షల వరకు  
2.0D/2.0P డైనమిక్ SE: రూ. 4.6 లక్షలు తగ్గింది. 

కియా కార్ల ధర రూ. 4 లక్షల 48 వేలు వరకు తగ్గాయి
కియా - రూ. 4లక్షల 48 వేల వరకు 
సోనెట్: రూ. 1లక్ష64 వేలు 
సైరోస్: రూ. 1లక్ష86 వేలు 
సెల్టోస్: రూ. 75,372 
కారెన్స్: రూ. 48,513  
కేరెన్స్ క్లావిస్: రూ. 78,674  
కార్నివాల్: రూ. 4లక్షల 48 వేలు తగ్గింది. 

టయోటా కార్ల ధర కూడా రూ. 3 లక్షల 49 వేలు  తగ్గింది. 
 ఫార్చ్యూనర్: రూ. 3 లక్షల 49 వేలు 
లెజెండర్: రూ. 3లక్షల 34వేలు 
హిలక్స్: రూ. 2 లక్షల 52 వేలు
వెల్‌ఫైర్: రూ. 2లక్షల 78వేలు 
కామ్రీ: రూ. 1లక్ష 1వెయ్యి  
ఇన్నోవా క్రిస్టా: రూ. 1లక్ష 80 వేలు 
ఇన్నోవా హైక్రాస్: రూ. 1 లక్ష 15వేలు 
ఇతర మోడళ్లు: రూ. 1 లక్ష11 వేల వరకు 

స్కోడా  కార్ల ధర పై చూస్తే రూ. 5లక్షల 8 వేలు తగ్గింది. 
కోడియాక్: రూ. 3 లక్షకు 30వేలు + రూ. 2 లక్షల 50 వేల పండుగ ఆఫర్ తో రూ. 5లక్షల 8 వేలు తగ్గింది. 
కుషాక్: రూ. 66వేలు GST తగ్గింపు + రూ. 2 లక్షల 50 వేల పండుగ ఆఫర్ కలిపి రూ. 3లక్షల 16 వేలు తగ్గింది. 
స్లావియా: రూ. 63వేలు GST తగ్గింపు + రూ. 1 లక్ష 20వేల పండుగ డిస్కోఉంటుతో మొత్తం రూ. 1లక్ష 8 వేలు తగ్గింది. 

రెనాల్ట్ కార్లపై రూ. 96,395 వరకు ధర తగ్గింది. 
రెనాల్ట్ - రూ. 96,395 వరకు 
కిగర్: రూ. 96,395 వరకు  

హ్యుందాయ్ కార్లపై రూ. 2.4 లక్షల వరకు ధర తగ్గింది. 
గ్రాండ్ ఐ10 నియోస్: రూ. 73,808 
ఆరా: రూ. 78,465  
ఎక్స్‌టర్: రూ. 89,209  
i20: రూ. 98,053  
i20 N-లైన్: రూ. 1 లక్ష 8 వేలు 
వెన్యూ: రూ. 1 లక్ష 23 వేలు  
వెర్నా: రూ. 60,640 
క్రెటా: రూ. 72,145  
క్రెటా N-లైన్: రూ. 71,762 
అల్కాజార్: రూ. 75,376 
టక్సన్: రూ. 2 లక్షల 4వేలు

మారుతి సుజుకి కార్ల ధరలు కూడా తగ్గాయి. 
ఆల్టో కె10: రూ. 40వేలు
వ్యాగన్ఆర్: రూ. 57వేలు
స్విఫ్ట్: రూ. 58వేలు
డిజైర్: రూ. 61వేలు
బాలెనో: రూ. 60వేలు
ఫ్రాంక్స్: రూ. 68వేలు
బ్రెజ్జా: రూ. 78వేలు
ఈకో: రూ. 51వేలు
ఎర్టిగా: రూ. 41వేలు
సెలెరియో: రూ. 50వేలు
ఎస్-ప్రెస్సో: రూ. 38వేలు
ఇగ్నిస్: రూ. 52వేలు
జిమ్నీ: రూ. 1లక్ష 14 వేలు
XL6: రూ. 35వేలు
ఇన్విక్టో: రూ. 2 లక్షల 25 వేలు

నిస్సాన్ కార్లపై రూ. 1 లక్ష వరకు ధర తగ్గింది
మాగ్నైట్ విసియా MT: రూ. 6 లక్షల లోపు వస్తుంది.
మాగ్నైట్ ఎన్-కనెక్టా సివిటి & కురో సివిటి: ఇప్పుడు రూ. 10 లక్షల లోపు వస్తుంది. 
మాగ్నైట్ CVT టెక్నా: సుమారు రూ. 97,300  తగ్గింది
మాగ్నైట్ CVT టెక్నా+: సుమారు రూ. 1 లక్ష400 ధర తగ్గింది.
CNG రెట్రోఫిట్‌మెంట్ కిట్: ఇప్పుడు ధర రూ. 71,999 అంటే రూ. 3వేలు తగ్గింది. 
ఈ ధరల తగ్గింపు భారతదేశంలో మొత్తం కార్ల అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు.