మీ ఫోన్ లో చిన్న చిప్ వేసుకుంటే చాలు.. హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేస్తోంది..

మీ ఫోన్ లో చిన్న చిప్ వేసుకుంటే చాలు.. హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేస్తోంది..

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ సాటిలైట్ ఇంటర్నెట్ సంబంధించి గుడ్ న్యూస్  చెప్పారు. మొబైల్ ఫోన్లు ఇప్పుడు డైరెక్ట్ సాటిలైట్కి  కనెక్ట్ అయ్యేల కొత్త చిప్‌సెట్‌ తయారుచేసేందుకు స్పేస్‌ఎక్స్, స్టార్‌లింక్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. దింతో ప్రజలు జియో, ఎయిర్‌టెల్ వంటి లోకల్ నెట్‌వర్క్‌పై ఆధారపడకుండా ఇక ప్రపంచంలో ఎక్కడి నుండైన హై-స్పీడ్ ఇంటర్నెట్‌ పొందోచ్చు. 

కాలిఫోర్నియాలో జరిగిన ఆల్-ఇన్ సమ్మిట్‌లో ఎలోన్ మస్క్ మాట్లాడుతూ ఈ చిప్‌సెట్ దాదాపు రెండు ఏళ్లలో  రెడీ  అవుతుందని,  ఈ టెక్నాలజీతో ప్రజలు ఎక్కడ ఉన్నా, వారి ఫోన్‌లో వీడియోలు, సినిమాలు స్ట్రీమ్ చేయొచ్చని ఇంకా ఇంటర్నెట్  ఈజీగా ఉపయోగించుకోవచ్చని అన్నారు. 

సాటిలైట్ నుండి ఇంటర్నెట్ మీకు ఎలా వస్తుంది: భూమి మీద ఎక్కడి నుండైనా ఇంటర్నెట్ కవరేజీ కోసం ఉపగ్రహాలు(సాటిలైట్) ఉపయోగపడతాయి. ఇది చాలా వేగంగా, తక్కువ జాప్యం (latency) ఉన్న ఇంటర్నెట్‌ను అందిస్తుంది.  జాప్యం అంటే డేటా ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళడానికి పట్టే సమయం.

ప్రస్తుతం, స్టార్‌లింక్ కిట్‌లో స్టార్‌లింక్ డిష్, వైఫై రౌటర్, పవర్ సప్లయ్ కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం డిష్‌ని ఆకాశం కనిపించే చోట పెట్టాలి. ఈ స్టార్‌లింక్ యాప్ iOS, Androidలో కూడా ఉంది, ఇది సెటప్ నుండి మొత్తం ప్రతిదీ చూసుకుంటుంది.

మొబైల్ ఫోన్‌ల కోసం కొత్త చిప్ అందుబాటులోకి వస్తే స్టార్‌లింక్ కిట్ అవసరం ఉండదు. ఈ కొత్త చిప్ ఫోన్‌లను డైరెక్ట్ స్టార్‌లింక్ ఉపగ్రహాలకు కనెక్ట్ చేస్తుంది. దీనివల్ల మీరు ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా వీడియోలు చూడవచ్చు, గేమ్స్ ఆడవచ్చు ఇంకా వీడియో కాల్స్ చేసుకోవచ్చు అని ఎలాన్ మస్క్ చెప్పారు.

కొత్త చిప్ ఉన్న ఫోన్లు దాదాపు రెండు ఏళ్లలో మార్కెట్లోకి రావొచ్చు. అయితే ఈ చిప్‌సెట్ ప్రత్యేక ఫ్రీక్వెన్సీపై పనిచేస్తుంది, దీని కోసం మనం ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. అంటే 2027 నాటికి ఈ టెక్నాలజి అందుబాటులోకి రావచ్చు చెప్పారు.

స్టార్‌లింక్ స్పేస్‌ఎక్స్ ప్రత్యేక ప్రాజెక్ట్:  స్టార్‌లింక్ అనేది స్పేస్‌ఎక్స్ ప్రాజెక్ట్, ఇది శాటిలైట్ల ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ అందిస్తుంది. దీని ఉపగ్రహాలు భూమికి దగ్గరగా కక్ష్యలో తిరుగుతాయి, ఇది ఇంటర్నెట్‌ను వేగంగా అలాగే  సులభంగా చేస్తుంది. మారుమూల గ్రామాలు ఇంకా  ఎతైన పర్వతాలు వంటి ఇంటర్నెట్ చేరుకోని ప్రాంతాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది.