Mirai Review: ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’ రివ్యూ: తేజా సజ్జా అడ్వెంచరస్ మైథాలజీ ఎలా ఉందంటే?

Mirai Review: ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’ రివ్యూ: తేజా సజ్జా అడ్వెంచరస్ మైథాలజీ ఎలా ఉందంటే?

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌’ (Mirai). మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్గా మూవీ రూపొందించారు కార్తీక్ ఘట్టమనేని. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇవాళ శుక్రవారం (Sep 12న) ప్రపంచవ్యాప్తంగా 2డి, 3డి ఫార్మాట్స్‌‌‌‌‌‌‌‌లో దాదాపు ఎనిమిది భాషల్లో మిరాయ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇందులో తేజ సూపర్ యోధ అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నాడు. రితికా నాయక్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌‌‌‌‌‌‌‌గా కనిపించారు. శ్రియా శరణ్, జగపతిబాబు, జయరామ్ కీలకపాత్రలు పోషించారు. హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మిరాయ్ రావడంతో తేజకు ఎలాంటి హిట్ దక్కింది? ప్రభాస్ క్యామియో ఎలా ఉందనేది రివ్యూలో చూసేద్దాం. 

కథ:

ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో తొమ్మిది గ్రంథాలు ఉంటాయి. ప్రతి చోటా ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా మహిమాన్విత శక్తులు ఉన్న వ్యక్తులు ఉంటారు. ఆ కవచాలను దాటుకుని ఒక్కో గ్రంథాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తాడు మహావీర్ లామా (మంచు మనోజ్).

అక్కడ నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకొని తాను భగవంతునిగా మారాలని అనుకుంటాడు. అయితే అమరత్వానికి సంబంధించిన తొమ్మిదో గ్రంథం సొంతం చేసుకోవడం అంత సులభం కాదని అతనికీ తెలుసు. ఇలాంటి దుష్టశక్తుల, క్రూర మృగాల రాకను ముందుగానే గమినిస్తుంది అంబిక (శ్రియా శరణ్). తొమ్మిదో గ్రంథానికి కట్టుదిట్టమైన బలమైన రక్షణగా మారుతుంది అంబిక. అయితే, మహావీర్ లామాను ఎదుర్కోవడానికి తన బిడ్డ వేద (తేజా సజ్జా)కు జన్మనిస్తుంది. కానీ, బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే దూరం అవుతుంది. అలా వారణాసి, కలకత్తా, హైదరాబాద్ వివిధ నగరాల్లో వేద పెరుగుతాడు.

ఈ క్రమంలో తాను వేద నుంచి యోధగా ఎలా పరిణామం చెందాడు? ఎలాంటి విద్యలు నేర్చుకున్నాడు? లామాను ఎదుర్కొన్న సమయంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతను అంబిక పుత్రుడు అని ఎప్పుడు ఎలా తెలిసింది? మహావీర్ లామా, యోధ మధ్య యుద్ధంలో ఏం జరిగింది? అశోకుడు, శ్రీరాముడు పాత్రల ఎంట్రీ ఎలా ఉంటుందనేది మిగతా సినిమా.

ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తేజ సజ్జా-మంచు మనోజ్ల యుద్ధం, విజువల్స్ సినిమాకు గొప్ప అనుభూతి కలిగిస్తుందని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. పురాణ ఇతిహాసాలకు తనదైన అడ్వెంచర్ యాక్షన్ జోడించి డైరెక్టర్ కార్తీక్ సక్సెస్ అయినట్లు ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాడు. మూవీ స్టార్టింగ్ లోనే ఓ కీలకమైన ఎపిసోడ్ గురించి ప్రభాస్ ఇంట్రడక్షన్ ఇవ్వడం విశేషం. ఈ క్రమంలోనే తేజ చెబుతూ డార్లింగ్ ప్రభాస్కి థ్యాంక్స్ చెప్పాడు. అసలు ఆ సీన్ ఏంటి? దీనికి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకునేది చూడాల్సిందే.