
మేడిపల్లి, వెలుగు: మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు, పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్‌లో ఉంటున్న బాలిక (8)ను సోమవారం మధ్యాహ్నం స్థానికంగా ఓ జిమ్‌లో ట్రైనర్‌గా చేస్తున్న ఉపేందర్ (29) అనే యువకుడు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి మాయమాటలతో జిమ్ లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటికి వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తల్లిదండ్రులు ఇంటికి రాగానే బాలిక కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా జాడ దొరక్కపోవడంతో అనుమానంతో జిమ్ వద్దకు వెళ్లి చూడగా బాలిక ఉంది. అయితే జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అత్యాచార నిరోధక చట్టం (పోక్సో) కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.