బండి కింద పడుతున్నట్టు యాక్షన్ హెల్ప్చేసే వ్యక్తి నుంచి ఫోన్లు చోరీ 

బండి కింద పడుతున్నట్టు యాక్షన్ హెల్ప్చేసే వ్యక్తి నుంచి ఫోన్లు చోరీ 
  •     సిటీలో కేటుగాళ్ల మాయ  
  •     సీసీటీవీలో రికార్డయిన ఘటన

కుషాయిగూడ, వెలుగు :  కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రీపురంలో ఇద్దరు దొంగలు తమ బైక్​పడిపోతున్నట్టు నటించి...హెల్ప్​చేయడానికి వచ్చిన వ్యక్తి నుంచి రెండు మొబైల్స్​కొట్టేశారు. చక్రీపురానికి చెందిన నారాయణ తన బైక్‌‌‌‌పై అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోకి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతడి జేబులో రెండు ఫోన్లు ఉండడాన్ని గుర్తించారు. అతడి వెంటే బైక్​పై వెళ్లారు.

అతడు లోపల టూ వీలర్​పార్క్​చేస్తుండగా..అతడి అపార్ట్​మెంట్​ముందుకు వెళ్లారు. అందులో ఒకరు కొంతదూరంలో దిగిపోగా, మరో వ్యక్తి తన బైక్​ను పక్కకు వంచి ఎక్స్​లేటర్​రేస్​చేశాడు. ఏదో సౌండ్​ వచ్చిందని నారాయణ బయటకు వచ్చే సరికి ఆ వ్యక్తి బండి పైకి లేపడానికి ట్రై చేస్తున్నాడు. దీంతో నారాయణ హెల్ప్​చేయడానికి బైక్​దగ్గరకు రాగా, కొంతదూరంలో ఉన్న మరో వ్యక్తి కూడా వచ్చి అతడితో పాటు బైక్‌‌‌‌ పైకి లేపుతున్నట్టు నటించి క్షణాల్లో అతడి జేబులోని రెండు ఫోన్లు మాయం చేశాడు. వెంటనే థాంక్స్​చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు.

నారాయణ అపార్ట్​మెంట్​లోపలకు వస్తూ తన జేబులోని ఫోన్లు మాయం కావడాన్ని గమనించాడు. వెంటనే వెళ్తున్న వారిని చప్పట్లు కొట్టి పిలిచినా వారు ఆగలేదు. చోరీకి గురైన రెండు ఫోన్ల విలువ రూ.లక్ష ఉంటుందని తెలిపాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.