ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్

ఫిబ్రవరి 18 నుంచి  హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో  గోల్ఫ్ క్రీడను ప్రోత్సహించే లక్ష్యంతో  ఈ నెల 18 నుంచి హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ను నిర్వహిస్తున్నట్టు టీ గోల్ఫ్ ఫౌండేషన్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ -కంట్రీ క్లబ్  ప్రకటించాయి. ఈ నెల 21వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి జెర్సీలను ఆర్గనైజర్లు సోమవారం ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా టీ గోల్ఫ్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి మాట్లాడుతూ  దేశవ్యాప్తంగా ఉన్న అమెచ్యూర్ గోల్ఫర్లకు ఇది ఒక గొప్ప వేదిక అన్నారు. హైదరాబాద్‌‌‌‌ను గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ టోర్నీ  ఒక మైలురాయి అవుతుందన్నారు. స్ట్రోక్ ప్లే పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో విజేతలకు ట్రోఫీలతో పాటు లాంగెస్ట్ డ్రైవ్, క్లోజెస్ట్ పిన్ వంటి కేటగిరీల్లో ట్రోఫీలు అందజేస్తామని టోర్నీ డైరెక్టర్ పాపిరెడ్డి తెలిపారు.