ఇన్నాళ్లూ హైదరాబాద్ ఓఆర్‌‌‌‌ఆర్ హైస్పీడ్ రోడ్‌.. ఈ ప్రాజెక్ట్ గానీ సక్సెస్ అయితే..

ఇన్నాళ్లూ హైదరాబాద్ ఓఆర్‌‌‌‌ఆర్ హైస్పీడ్ రోడ్‌.. ఈ ప్రాజెక్ట్ గానీ సక్సెస్ అయితే..
  • సోలార్ ఎనర్జీ కారిడార్గా ఓఆర్ఆర్
  • ఔటర్ పొడవునా సోలార్ ​ప్లాంట్​ నిర్మాణానికి ప్రణాళిక
  • 100 మెగావాట్ల విద్యుత్ ​ఉత్పత్తికి రూపకల్పన
  • ఉత్పత్తి అయిన కరెంట్ను టీజీఎస్పీడీసీఎల్​ గ్రిడ్​కు అనుసంధానం
  • డీపీఆర్​ తయారీకి సన్నాహాలు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: అభివృద్ధిలో రాకెట్ ​వేగంతో దూసుకెళ్తున్న గ్రేటర్ హైదరాబాద్కు సింబల్​గా ఉన్న158 కి.మీ. పొడవైన ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌‌‌‌ఆర్) త్వరలో సోలార్ కారిడార్గా రూపాంతరం చెందనుంది. 8 లేన్ల హైస్పీడ్​రోడ్గా ఉన్న ఔటర్ సెంట్రల్ మీడియన్పై 100 మెగావాట్ల రూఫ్ ​టాప్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏలోని హైదరాబాద్ ​గ్రోత్​ కారిడార్​(హెచ్​జీసీఎల్​) అధికారులు ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. ఓఆర్‌‌‌‌ఆర్ అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రోడ్‌‌‌‌గా మాత్రమే కాకుండా, క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రంగా మారనుంది.

ఉత్పత్తి అయిన కరెంట్​ను టీజీఎస్పీడీసీఎల్ గ్రిడ్కు అనుసంధానం చేసి, సొంత అవసరాలకు లేదా విక్రయం ద్వారా ఆదాయం పొందేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. ఈ ప్రాజెక్ట్ కార్బన్ ఉద్ఘారాలను తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుంది. ఇప్పటికే గ్రేటర్​పరిధిలో పలు కీలక ప్రాజెక్టుల నిర్వహణతో పాటు పర్యాటక కేంద్రాల అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్న హెచ్ఎండీఏ త్వరలో సోలార్​ పవర్​జనరేషన్​లోనూ తన ప్రత్యేకతను చాటుకునేందుకు సిద్ధమవుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు.

డీపీఆర్కు కన్సల్టెన్సీల ఆహ్వానం
ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిటెయిల్డ్​ప్రాజెక్ట్ ​రిపోర్ట్​ (డీపీఆర్) తయారు చేసేందుకు కొన్ని కన్సల్టెన్సీ సంస్థలను ఆహ్వానించాలని అధికారులు నిర్ణయించారు.100 మెగావాట్ల రూఫ్​టాప్​ సోలార్​ ప్లాంట్​ల ఏర్పాటు, నిర్వహణ, దానికయ్యే వ్యయం, ఉత్పత్తి సామర్థ్యంపై కన్సల్టెన్సీ సంస్థల నుంచి అధికారులు నివేదికలను కోరుతున్నారు.

ఉత్పత్తి అయిన కరెంట్​ను ఓఆర్ఆర్​కు ఆనుకొని ఉన్న కొల్లూరు, సుల్తాన్​పూర్, ఇంజాపూర్, రావిర్యాల, తుక్కుగూడ, మహంకాళి, పెద్ద గోల్కొండ, కిస్మత్‌‌‌‌పూరా వంటి సబ్​స్టేషన్​ల ద్వారా టీజీఎస్పీడీసీఎల్ గ్రిడ్‌‌‌‌కు అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ సోషియో-ఎకనామిక్ ప్రయోజనాలు, క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అధికారులు తెలిపారు. ఎంపికైన కన్సల్టింగ్ ఏజెన్సీ 45 రోజుల్లో డీపీఆర్ సమర్పించాలని నిబంధన విధించారు.