
రోజంతా ఉద్యోగాలతో బిజీగా గడుపుతున్న నగరవాసులు.. టెన్షన్ రిలీఫ్ కోసం ఇంట్లోనే జంతువులు, మొక్కలు పెంచుతున్నారు. ఆఫీస్ లో వర్క్ బిజీ ఉండి సాయంకాలం ఇంటికి రాగానే పెట్స్ తో సరదాగా గడపడం ఉత్సాహాన్ని ఇస్తుందని పలువురు చెప్పారు. గతంలో ఇంట్లో సందడి కోసం కొన్ని పెట్స్ ను అడాప్ట్ చేసుకునే వారు..అయితే ఇప్పుడిదే ట్రెండ్ అయింది.
పెట్స్ ని చూస్తే చాలు ఉన్న టెన్షన్ అంతా మరచిపోతామని అంటున్నారు పెట్ లవర్స్. మైండ్ రిలాక్స్ అవడంతో పాటు మనసుకు శాంతి ఉంటుందని తెలిపారు.. దీంతో పాటే కొందరు ఇంటిని నందనవనం చేస్తున్నారు. పెట్ డాగ్స్ తో పాటు… ఇండోర్ ప్లాంట్స్ పెంచేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అపార్ట్ మెంట్ కల్చర్ ను అడాప్ట్ చేసుకున్న నగర ప్రజలు.. ప్రశాంతమైన పచ్చని వాతావరణాన్ని కోరుకుంటున్నారు. అందుకే ఇంట్లోనే చిన్నపాటి తోటను సృష్టిస్తున్నారు. ఎక్కువగా బోన్సాయ్, మనీ లాంటి, హైబ్రిడ్ వెరైటీ, సువాసన వెదజల్లే కొని రకాల చెట్లను పెంచుకోవడానికి జనం ఇష్టపడుతున్నారు.