28న ఎన్డబ్ల్యూడీఏ జనరల్ బాడీ మీటింగ్ .. బనకచర్లను వ్యతిరేకించాలని సర్కారు నిర్ణయం

28న ఎన్డబ్ల్యూడీఏ జనరల్ బాడీ మీటింగ్ .. బనకచర్లను వ్యతిరేకించాలని సర్కారు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: దేశంలోని వివిధ నదుల అనుసంధాన ప్రాజెక్టులపై చర్చించేందుకు నేషనల్​వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) జనరల్​ బాడీ మీటింగ్​ను నిర్వహించనుంది. ఈ నెల 28న ఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలతో చర్చించిన అంశాల ఆధారంగా జనరల్​ బాడీ మీటింగ్​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

అయితే, అంతకన్నా ముందు ఈ నెల 22న హైదరాబాద్​ జలసౌధలో ఎన్​డబ్ల్యూడీఏ రాష్ట్రాలతో కన్సల్టెంట్​ మీటింగ్​ను నిర్వహించనుంది. ఆ మీటింగ్​లో రాష్ట్రాలు చెప్పిన అభిప్రాయాలను జనరల్​ బాడీ మీటింగ్​లో ఎజెండాగా పెట్టనున్నారు. కాగా, గోదావరి కావేరి లింకింగ్​లో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

 ఏపీ తలపెట్టిన పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్టుకు చెక్​ పెట్టాలంటే జీసీ లింక్​కు ఓకే చెప్పడమే బెటర్​ అని సర్కారు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కన్సల్టెంట్​ మీటింగ్​లో స్పష్టం చేసి.. జనరల్​ బాడీ మీటింగ్​లోనూ లేవనెత్తాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ఎజెండాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటిదాకా జీసీ లింక్​లో మనం చెబుతున్న అభిప్రాయాలు, అభ్యంతరాలనూ ఎజెండాలో పెట్టనున్నారు. కొన్ని పట్టువిడుపులకు పోయేలా సర్కారు యోచిస్తున్నట్టుగా తెలిసింది.