
గోదావరిఖని, వెలుగు : రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజస్థాన్‌కు చెందిన రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన్ సంస్థాన్ సహకారంతో గురువారం నుంచి స్థానిక సిగ్మా హాస్పిటల్లో ఉచిత ప్రకృతి వైద్య చికిత్స శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరాన్ని లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ పి.మల్లికార్జున్, ప్రెసిడెంట్ ఎల్లప్ప, ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం ఆక్యూ ప్రెషర్, సుజోక్ కప్పింగ్, వైబ్రేషన్ థెరఫీతో డాక్టర్ వైష్ణవ్ చికిత్స అందిస్తున్నారని, ఈ నెల 19వ తేది వరకు జరగనున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందించే ప్రకృతి వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు టిహెచ్ ఆకాష్ శర్మ, పిహెచ్ విష్ణు లాండ్యే, క్లబ్ ట్రెజరర్ రాజేంద్ర కుమార్, కజాంపురం రాజేందర్, బంక రామస్వామి, పి.శరత్ బాబు, బేణి గోపాల్ త్రివేది, సత్యనారాయణ, రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.