
మల్లాపూర్(ఇబ్రహీంపట్నం),వెలుగు:- గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎద్దండి గ్రామంలో ఉన్న గోదావరి తీర ప్రాంతాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. వర్షాల పడుతున్న నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు.
గతంలో కురిసిన వర్షాల వల్ల వరద బీభత్సంతో ఏర్పడిన ఇబ్బందులకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. మత్య, పశువుల కాపర్లు గోదావరి వైపు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీఓ సలీం వివిధ శాఖ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.