
- రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. ఆరు నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసిన వారు వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారన్నారు.
నేషనల్ స్కాలర్ షిప్ కింద 1 నుంచి 4వ తరగతి చదివే పిల్లలకు రూ. వెయ్యి, 5 నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు 1500, 9 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు రూ.2 వేలు, ఇంటర్ పిల్లలకు రూ.3 వేలు, డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల చదివే పిల్లలకు రూ. 6 వేలు, ఐటీఐ పాలిటెక్నిక్ చదివే పిల్లలకు రూ.8 వేలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చేసే విద్యార్థులకు రూ. 25 వేలు స్కాలర్‌షిప్ అందుతుందన్నారు.
1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఆగస్టు 31 లోపు, ఇంటర్ పై చదువు చదివి విద్యార్థులు అక్టోబర్ 31 లోపు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు సమర్పించాలన్నారు. దరఖాస్తులు ఆగస్టు 31 లోపు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. scholarships.gov.in , జాతీయ స్కాలర్షిప్ నందు దరఖాస్తుల సమర్పించాలన్నారు.
ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా అప్పగించాలి
జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. గురువారం కలెక్టరేట్ లో ప్రభుత్వ భూమిని ఓజ్జల రాములు ఎస్పీ మహేష్ బీ గితే సమక్షంలో సరెండర్ చేశారు.
సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామానికి చెందిన ఓజ్జల లావణ్య భర్త ఓజ్జల రాములు సర్వే నెంబర్ 61/47లో గల 4 ఎకరాల 2 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ వివరించారు. ఎగువ మానేరు ప్రాజెక్టును కలెక్టర్ ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి సాయంత్రం పరిశీలించారు. డ్యామ్ పూర్తిస్థాయిలో నిండితే ఎక్కువైన నీటిని కాలువల ద్వారా విడుదల చేయాలని సూచించారు.